పోలీస్ శాఖ పరేడ్

24-10-2026 | 06:28pm

నిర్మల్ అక్టోబర్ 24 ( విజయక్రాంతి) : నిర్మల్ పోలీస్ శాఖ(Nirmal Police Department) ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాస్(DSP Srinivas) ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది క్రమశిక్షణ(Staff Discipline), సమన్వయం, శారీరక సంసిద్ధతకు ప్రాధాన్యతనిచ్చారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని(Mental health) కూడా కాపాడుకోవాలని అధికారులు సూచించారు.

పోలీస్ సిబ్బంది నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని తెలిపారు. వ్యక్తిగతంగా లేదా విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు