‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‎డేట్..షాన్స్‎కు గుడ్ న్యూసే

19-09-2026 | 03:16pm

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌(Shooting)కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన టాకీ పార్ట్‌ను దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో ఆయన షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నట్లు టాక్. ఇదే సమయంలో మహేష్ డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ప్రియాంక చోప్రా తన ప్రధాన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయగా, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన కీలక టాకీ పార్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళి పోస్ట్‌ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.




మరిన్ని వార్తలు