అరిటాకులో అన్నదానం అభినందనీయం

23-09-2026 | 07:45pm

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్,(విజయక్రాంతి): వినాయక మండపాల వద్ద అరటి ఆకులో అన్నదానం అభినందనీయమని నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్ పూర్ గ్రామంలో గ్రామ యువత వినాయక మండపం(Vinayaka Mandapam) వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో పూర్తిగా ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లను నిరోధించి, అరటి ఆకులో భోజనం చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. అనంతరం అక్కడ యువతకు వాలీబాల్, నెట్టు, తదితర క్రీడా సామాగ్రి బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది స్వామి, సర్పంచి, ఉప సర్పంచ్, కార్యదర్శి ఉన్నారు.

మరిన్ని వార్తలు