బీసీ కులగణన, హామీల అమలుపై పోరు
బి ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్
ఖానాపూర్ (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్వహించనున్న 20 27 జన గణనలో బీసీ కుల గణన(BC caste census) కాలం చేర్చాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల(Congress government elections) సందర్భంగా ప్రకటించిన బీసీ ఎస్సీ ఎస్టీ రైతు డిక్లరేషన్ల హామీలను(Farmer Declaration Promises) పూర్తిస్థాయిలో అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ లో సీఎం రావు ఫంక్షన్ హాల్ లో వామపక్ష అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 23 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తున్నామని, దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులాల వారీగా జనాభా లెక్కల తో పాటు ప్రజల సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి ,స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మంచు కంటి లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ కే సంజీవ్, మహమూద్, భోజన్న ,భోదాసు గణేష్ ,సుర రాజన్న, హైమద్ ఖాన్, నరసయ్య, కె మధు, కమల, స్వరూప ,సిహెచ్ కళ, విద్యార్థి సంఘం నాయకులు సిహెచ్ ఆనంద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.