నా మనోబలాన్ని, అభిమానాన్ని చించలేరు

18-09-2026 | 05:20am
  1. ఈ వేడుకలకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదు 
  2. డాక్టర్ ప్రీతీ రెడ్డి
  3. 500 మంది వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనాలు..
  4. బ్రాహ్మణ సమారాధన మధ్య జన్మదిన వేడుకలు

హైదరాబాద్/మేడ్చల్(విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతీ రెడ్డి (Dr. Preethi Reddy) తన జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చించివేత ఘటనపై ఘాటుగా స్పం దించారు. తన జన్మదిన వేడుకలు పూర్తిగా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా జరిగాయని.. వీ టితో ఏ రాజకీయ పార్టీకి లేదా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్ప ష్టం చేశారు.

తిరుపతి, ఉజ్జయిని, కాశీ, అ యోధ్య వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి విచ్చేసిన దాదాపు 500 మంది వేద పండితులు, అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛా రణలు, దివ్య ఆశీర్వచనాల మధ్య ఈ వేడుకలు జరిగాయని తెలిపారు. వారి సమక్షం లో బ్రాహ్మణ సమారాధన ముగించుకుని, అందరికీ ఇంట్లోనే ఆత్మీయ భోజనం ఏర్పా టు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.‘ఈ జన్మదిన వేడుకలు పార్టీ కార్యక్ర మం కాదు. ఒకవేళ ఇది రాజకీయ వేడుక అయి ఉంటే ప్రొటోకాల్ ప్రకారం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్,  ఇతర ము ఖ్య నాయకుల ఫొటోలను కచ్చితంగా ప్రిం ట్ చేసేవాళ్లం.

నాపై ఉన్న అభిమానంతో మా కాలేజీ సిబ్బంది, హాస్పిటల్ స్టాఫ్, అభిమానులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వారి ఆత్మీయతకు నేను ఎల్లప్పుడూ రుణప డి ఉంటాను. కొంతమంది అసూయతో నా ఫ్లెక్సీలను చించివేసి ఉండవచ్చు. ఫ్లెక్సీలను చించగలరేమో గానీ, నాకున్న మనోబలాన్ని, ప్రజలు, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రే మను ఎవరూ చించలేరు’ అని తనదైన శైలి లో నవ్వుతూ వ్యాఖ్యానించారు. భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల ఆదరణ ఉన్నంతవరకు ఇలాంటి చిల్లర చేతలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.


మరిన్ని వార్తలు