అగార్కర్‌కు పొడిగింపు లేనట్టే
చీఫ్ సెలెక్టర్ రేసులో ఓజా, పార్థివ్
ముంబై, సెప్టెంబర్ 17: బీసీసీఐ సెలక్షన్ కమిటీకి (BCCI Selection Committee) కొత్త చైర్మన్ రాబోతున్నాడు. ప్రస్తు తం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పదవీ కాలం వచ్చే నెలలో ముగియబోతోంది. అగార్కర్ పదవీ కాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగిస్తారని ప్రచారం జరిగింది. అగార్కర్ కూడా బోర్డుకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయితే ముందు సానుకూలంగా స్పందించిన బోర్డు ఇపుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అగార్కర్ పదవీకాలా నికి పొడిగింపు లభించే అవకాశం లేదని స మాచారం.
వెస్టిండీస్ సిరీస్ కోసం బుధవా రం జరిగిన టీమ్ సెలెక్షన్ మీటింగే అగార్కర్ అధ్యక్షతన జరిగిన చివరిది. వన్డే ప్రపంచకప్ వరకు ఆయన పదవిని పొడిగిస్తారని గతం లో భావించినప్పటికీ, రోహిత్ శర్మ భవిష్యత్తు మరియు జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ పెద్దలతో కొన్ని విభేదాలు, సమన్వయ లోపం రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగార్కర్ స్థానా న్ని భర్తీ చేసేందుకు మాజీ వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముందంజలో ఉన్నట్లు సమాచారం.
ఇద్ద రూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్‌లోనూ విజయవంత మైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరికి చీఫ్ సెలక్టర్ పదవి దక్కే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం జర గబోయే బీసీసీఐ వార్షిక సమావేశంలో దీని పై బోర్డు అధికారికంగా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
కాగా అగార్కర్ జూలై 2023లో బాధ్యతలు చేపట్టాడు. ఆయన ప దవీ కాలంలో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాలను సాధించి, ఐసీసీ ట్రోఫీ లు గెలిచింది. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికలుగా జరిగిన ఐసీసీ టీ20 వరల్ కప్‌ను భా రత్ కైవసం చేసుకుంది. మరో ఐసీసీ ఈవెం ట్ అయిన చాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్స్ వరకు దూసుకెళ్లి రన్నరప్‌గా నిలిచింది. అగార్కర్ పదవీ కాలంలో జట్టులో సీనియర్ల స్థా నంలో యువ రక్తాన్ని నింపే ప్రక్రియ వేగంగా సాగింది.