ప్యారడైజ్ రీల్స్ కోసం లక్షజడలు కొన్నారట!

18-09-2026 | 05:25am

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’(The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో (Directed by Srikanth Odela), ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై (SLV Cinemas banner) సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన స్పందన దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ.. “ప్రేక్షకులు థియేటర్‌లో మంచి మాస్ ఫిలిమ్‌ను చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో సెప్టెంబర్ 24న చూస్తారు. మేము ఒక మంచి కథని చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో, గొప్ప మూమెంట్స్‌తో తీశాం. నేను కమల్‌హాసన్, భాగ్యరాజా, భారతీరాజా సినిమాలు చూస్తూ పెరిగా. చెన్నై ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది.

ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో చక్కగా ఆదరించారు. ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. తమిళ్ కథలు వస్తే తప్పకుండా తమిళ్‌లో కూడా సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా. నా కెరీర్‌లో చేసిన చాలా హార్డ్ వర్కింగ్ మూవీ ఇది. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నా. కచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఇది థియేటర్‌లో చాలా క్రేజీ రైడ్‌లాగా ఉండబోతుంది. ఇప్పుడు అందరూ నన్ను నాని అని పిలుస్తారు.

మళ్లీ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా జడల్ అనే పేరుతో పిలుస్తారు. నిజంగా జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. షూటింగ్ డేస్‌లో చాలా కష్టంగా అనిపించింది. కానీ మహిళలు జీవితాంతం ఆ జడలతో ఉంటారు.. నిజంగా మహిళలందరికీ హ్యాట్సాఫ్. ఈ జడల లుక్, అపీరియన్స్ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా వైరల్‌గా మారుతోంది. జడల్ పాట తర్వాత ఇప్పటివరకు లక్ష జడలు అమ్మకం అయ్యాయట.

ఆ సాంగ్ రీల్స్ చేసేందుకు చాలా మంది ఆ జడలు కొన్నారని మా టీమ్ వాళ్లు చెప్పారు. కీర్తి ఈ సినిమాలో స్పెషల్ క్యామియో చేసింది. మేము చేసిన పాట ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కయాదు సుబ్బు పాత్రలో చేసింది. ఆ పాత్రకు 100% న్యాయం చేసింది” అని చెప్పారు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “ఇది రెవల్యూషనరీ ఫిలిమ్. నాని ఒక రెబల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. తన ప్రాంతం కోసం, ప్రజల కోసం, ఉనికి కోసం, తల్లి కోసం ఎలా పోరాడారు అనేది ఈ సినిమా ప్రధాన అంశం. మదర్ ఎమోషన్ కూడా తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని తెలిపారు. స్వరూప్ మాట్లాడుతూ.. “ప్యారడైజ్’   థియేటర్లో అద్భుతంగా ఉంటుందని నమ్మకం ఉంది” అని చెప్పారు. 

మరిన్ని వార్తలు