ఇంకా పాతకాలపు ఆలోచనలేనా?!

18-09-2026 | 05:25am

హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడు కల్లో పాల్గొన్నందుకు ఎదురైన సోషల్ మీడియా (Social media) ట్రోలింగ్స్‌పై యువ కథానాయిక ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)తాజాగా మరో సారి స్పందించింది. ముస్లిం అమ్మాయి అయ్యి ఉండి హిందూ పండుగలో బోనం ఎత్తడంపై కొందరు నెటిజన్లు చేసిన విమర్శలపై ఆమె తన తాజా చిత్రం ‘సిగ్మా’ (Sigma) ప్రెస్‌మీట్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు. బోనాల వివాదం, ట్రోలింగ్స్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా పరిణతితో బదులిచ్చింది ఫరియా. “మనం ప్రస్తుతం 2026వ సంవత్స రంలో జీవిస్తున్నాం.

ఇంత ఆధునిక కాలంలో ఉంటూ ప్రజలు ఇంకా పాతకాలపు సంకుచిత ఆలోచనలతోనే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో రకరకాల మనుషులు.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నా పోస్టులపై వచ్చే పాజిటివ్ రెస్పాన్స్‌నే  పరిగణన లోకి తీసు కుంటా” అన్నది. గతంలోనూ ఈ విషయంపై ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఫరియా, ‘ప్రతి జీవిలో దేవుడిని చూడడమే అసలైన భక్తి. ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే మీరు తప్పుడు మార్గంలో ఉన్నట్టే.

దేవుడు అంతటా విస్తరించి ఉండే ఒక దివ్యమైన వెలుగు’ అంటూ ఆధ్యాత్మికతకు మతాల హద్దులు ఉండకూడ దని బలంగా వ్యాఖ్యానిం చింది. గత నెలలో హైదరాబాద్ మీర్ ఆలం మండిలోని శ్రీ మహాకాళేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఫరియా సాంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనం ఎత్తుకుని, డప్పు దరువు లకు డ్యాన్స్ చేసింది. ఈ వీడి యోలు వైరల్ కావడంతో కొందరు ట్రోల్ చేశారు.

మొదట్లో దీనిపై భావోద్వేగా నికి గురైన ఫరియా, తాజాగా విమర్శకుల ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తూ గట్టి సమాధానమిచ్చింది. ఇక ‘సిగ్మా’ విషయానికి వస్తే.. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న యాక్షన్- అడ్వెంచర్ చిత్రమిది. ఇందులో ఫరియా హీరోయిన్. లైకా ప్రొడ క్షన్స్ బ్యానర్‌పై సుభా స్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతు న్నారు. అక్టోబర్ 2న రిలీజ్‌కు వస్తోందీ సినిమా. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూ టర్స్ లిమిటెడ్ తెలంగాణ, కోస్తాంధ్రల్లో విడు దల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. 

మరిన్ని వార్తలు