మెస్సీ @ 100 గోల్స్
క్లబ్ కెరీర్‌లో గోల్స్ సెంచరీ
లియోన్, సెప్టెంబర్ 17 : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 39 ఏళ్ల వయసులోనూ చరిత్ర సృష్టించాడు. తన ఇంటర్ మయామి క్లబ్ కెరీర్‌లో (Inter Miami Club Career) 100 గోల్స్ మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాంపియోన్స్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో క్రూజ్ అజ్పు గోల్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. మెస్సీ కేవలం 115 మ్యాచ్‌లోనే ఈ 100 గోల్స్ మార్కును సాధించాడు. మేజర్ లీగ్ సాకర్ చరిత్రలో ఒకే క్లబ్ తరఫున అత్యంత వేగంగా 100 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంటర్ మయామి తరఫున ఇప్పటివరకు 100 గోల్స్‌తో పాటు 55 అసిస్ట్‌లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 2023లో మెస్సీ ఇంటర్ మయామి క్లబ్‌లో చేరినప్పుడు తన తొలి గోల్‌ను క్రూజ్ అజ్పునే చేశాడు, ఇప్పు డు అదే జట్టుపై 100వ గోల్ చేశాడు. 2023 లో 11, 2024లో 23, 2025లో 43, 2026 లో 23 గోల్స్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంటర్ మయామి 2-0తో క్రూజ్ అజ్పు విజ యంతో కాంపియోన్స్ కప్ టైటిల్ ను కైవ సం చేసుకుంది. మెస్సీకి ఇది 49వ ట్రోఫీ.