పీఓపీ గణపతులకు బదులు మట్టి గణపతులనే వాడాలి
ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని అంబేద్కర్ కూడలి(Ambedkar Junction), బస్ స్టాండ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఎస్ఐ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఏఈఎస్, జిల్లా నోడల్ అధికారి డా శ్రీకాంత్ సహకారంతో ప్రజలకు పీఓపి గణపతి విగ్రహాలను(PoP Ganesha idols) వాడితే కలిగే పరిణామాలను గురించి అవగాహన కల్పించారు. పీఓపి గణపతి విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఎస్ఐ చేతుల మీదుగా ప్రజలకు 300 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నోడల్ అధికారి డా శ్రీకాంత్ విద్యార్థులకు పర్యావరణ హిత మట్టి విగ్రహాలపై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు 500 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.