ట్రాక్టర్‌ నుంచి పడి యువకుడి మృతి

20-09-2026 | 01:07pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని జిన్నెగట్టు గ్రామం(Jinnegattu Village)లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సున్నం శివాజీ ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు