పీఏసీఎస్ చైర్మన్ సీటుపై గురి?

11-09-2026 | 05:25am
  1. ఎమ్మెల్యే కసిరెడ్డి చుట్టూ ఆశావహుల చక్కర్లు.. 

తీవ్రమవుతున్న నామినేటెడ్ పదవుల ఉత్కంఠ

చైర్మన్ ఎంపికలో ఎమ్మెల్యే నే ఫైనల్ 

తలకొండపల్లి, సెప్టెంబర్10 (విజయక్రాంతి): మండల రాజకీయాల్లో మరోసారి కీలక నామినేటెడ్ (Nominated) పదవుల చర్చ వేడేక్కింది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం (పాక్స్ ) చైర్మన్ పదవితో పాటు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల పదవులను దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కల్వ కుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలి సి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు ఆశావహులు వినతులు అందజేస్తు న్నారు.

ప్రస్తుతం తలకొండపల్లి పీఏసీఎస్ చైర్మన్గా గట్ల కేశవరెడ్డి కొనసాగుతున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల దృ ష్ట్యా భవిష్యత్తులో కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారా లేక ప్రస్తుత చైర్మన్నే కొనసాగిస్తారా అనే అంశంపై మండలంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.అయితే ఈ దపా సింగిల్ విం డో కు చైర్మన్ వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

సామాజిక సమీకరణాల లెక్క.....

 పదవుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆచితూచి సామాజిక సమీకరణల పై దృష్టి సారించారు. దానిలో బా గానే గతంలో చైర్మన్ ఏ ఏ సామాజిక వర్గాల కు దక్కాయి.. అనీ ప్రతి అంశం పైన దృశ్య సాధించారు.ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘురాములు పీఏసీఎస్ చైర్మన్ పదవితో పాటు ఇతర నామినేటెడ్ పదవుల రేసులో ముం దు వరుసలో ఉన్నారు.

బీసీ సామాజిక వర్గం నుంచి వెంకటాపూర్ మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం బలంగా తమ దావాను వినిపిస్తున్నారు.ఓసీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి పదవిని ఆశిస్తూ లాబీయింగ్ ము మ్మరం చేశారు.

పార్టీకి చేసిన సేవలు, స్థానిక నాయకత్వ బలం, సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకే పదవికి పలు సామాజిక వర్గాల నుంచి బలమైన అభ్యర్థులు పోటీపడుతుండటంతో అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ రాజకీయ సస్పెన్స్ కొనసాగనుంది.

మరిన్ని వార్తలు