కోడలిపై గొడ్డలితో మామ దాడి
11-09-2026 | 08:51am
కర్నూలు ఆసుపత్రికి తరలింపు
గట్టు: చాగదోన గ్రామంలో కోడలిపై మామ గొడ్డలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం కలగలేదనే విషయమై కొయ్యి తిమ్మప్ప తన కోడలు రీటాను గతంలో వేధించినట్లు తెలిపారు. ఇటీవల ఇటుకల పనికి సంబంధించి తీసుకున్న రూ.లక్ష అడ్వాన్స్ డబ్బులతో మామ మద్యం సేవిస్తున్నాడని రీటా ప్రశ్నించడంతో ఆగ్రహించిన తిమ్మప్ప ఇంట్లోనే ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో రీటాకు తలకు తీవ్ర గాయమైంది. తొలుత ఐజ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి(Kurnool Government Hospital) తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిమ్మప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.