స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కు 50 జట్లు

11-09-2026 | 08:43am

బీవీఆర్‌ఐటీ నుంచి జాతీయ స్థాయికి ఎంపిక

నర్సాపూర్: బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో రెండు రోజులుగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్‌–2026( Smart India Hackathon) పోటీలు గురువారం ముగిశాయి. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగిన పోటీల్లో వివిధ విభాగాలకు చెందిన 360 జట్లలో 2,160 మంది విద్యార్థులు పాల్గొన్నారు.స్మార్ట్ ఆటోమేషన్‌, గ్రీన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, హెల్త్‌కేర్‌, వ్యవసాయం తదితర రంగాల్లో సామాజిక సమస్యలకు విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు.

జ్యూరీ మూల్యాంకనం అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 50 జట్లను జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా,హ్యాకథాన్‌–2026 కు ఎంపిక చేశారు.కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ దూబే, మేనేజర్‌ బాపిరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఎస్పీవోసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ యు. గణేష్‌ నాయుడు, టీపీఓ డాక్టర్‌ జె. బంగార్రాజు, విద్యార్థి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.


మరిన్ని వార్తలు