ఉపాధ్యాయుడిగా అవతారం ఎత్తిన ఐటీడీఏ పీఓ..
23-09-2026 | 07:08pm
* ప్రతి విద్యార్థి లక్ష్యసాధన దిశగా విద్యను అభ్యసించాలి..
ఉట్నూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పిఓ మంద మకరందు(ITDA PO Manda Makarandu) పాఠశాల ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలో ఐటిడిఏ పిఓ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు విద్యపై కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంను నిర్ణయించుకొని ఉపాధ్యాయులు బోధించే విద్యను సక్రమంగా వింటూ ఉన్నత విద్యాలవంతులుగా ఎరిగేందుకు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు