గుండె ఆపరేషన్ నిమిత్తమై నాలుగు యూనిట్ల రక్తం అందజేత
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని కిమ్స్ వైద్యశాల(KIMS Hospital)లో గుండె ఆపరేషన్ నిమిత్తమై గంగారం(75)కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు(IVF Seva Dal State Chairman Dr. Balu)ను సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎం ఏ వాజిద్(ఏ ఆర్ కాస్టేబుల్), చెన్నబోయిన ప్రసాద్, పబ్బ ఆర్యన్, పర్ష తృషాల్ (సాఫ్ట్ వేర్ ఇంజనీర్)లు మానవతా దృక్పథంతో స్పందించి హైద్రాబాద్ కు వెళ్లి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. నిస్వార్ధంగా సేవ చేసే గొప్ప వ్యక్తులు రక్తదాతలని అన్నారు.రక్త దానానికి ముందుకు వచ్చిన రక్త దాతలకు అభినందనలు తెలియజేశారు.