4 May, 2026 | 12:24 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

29-04-2026 12:36 AM

నారాయణపేట. ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఫ్రిజ్ లు, మందుల డబ్బాలు .కార్యాలయ ఆవరణలో ఉండటం చూసిన కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రోగ్రామ్ అధికారిని ప్రశ్నించగా ఫ్రిజ్ లు  తిరిగి పంపించాల్సి ఉందని, మందులు పిహెచ్ సి లకు సరఫరా చేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు.  నిబంధనల ప్రకారం  మందులను ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.