చినుర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 23 (విజయ క్రాంతి):మండలంలోని చీనూరు గ్రామపంచాయతీనీ(Cheenuru Grama Panchayat) మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్ శుక్రవారం సందర్శించడం జరిగింది.గ్రామంలోనీ ఇందిరమ్మ ఇల్లు పరిశీలన మరియు ఇంకుడు గుంతలకు మార్క్ అవుట్ ఇవ్వడం,హార్వెస్టింగ్ పాండ్ చెల్లించారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయని,ఎన్ని పూర్తయ్యాయని తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గంగాధర్,ఎంపీఓ ప్రభాకర్ చారి,ఏపీఓ సక్కుబాయి, పంచాయతీ కార్యదర్శి అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య,వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.