బొల్లారం గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి మార్కింగ్
నాగిరెడ్డిపేట,అక్టోబర్ 23 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మార్కింగ్ చేయడం జరిగింది.వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడం,నీటి వృథాను అరికట్టడం,
భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించడంతో పాటు వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యలు,వరదల ప్రభావాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ ఫరీనా బేగం, వార్డు మెంబర్లు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.