3 May, 2026 | 1:21 AM

గోదావరి జిల్లాల కథ మేము కాప్‌లం

03-05-2026 12:00 AM

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అదే ‘మేము కాప్‌లం’. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందర గోళం.. ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా సిరీస్ టైటిల్‌ను మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అందులో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియో అన్ని మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సిరీస్‌కు బీవీఎస్ రవి, కౌముది కే నేమాని నిర్మాతలు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌కు శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో నటించారు. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ఓ కేసును విచారించడానికి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగడంతో మొదలయ్యే కథ ఇది. త్వరలోనే ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.