calender_icon.png 9 February, 2026 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లింకారా గోల్డ్ అండ్ డైమండ్స్

09-02-2026 01:50:58 AM

సికింద్రాబాద్‌లో తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆభరణాల రిటైల్ రంగంలో అధికారికంగా అడుగుపెట్టిన క్లింకారా గోల్డ్ అండ్ డైమండ్స్, సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్డులో తమ తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించింది. సుమారు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్, నైపుణ్యంతో కూడిన కళాత్మక డిజైన్లు, స్వచ్ఛత, పారదర్శక ధరలతో కూడిన ప్రీమియం జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 8 నుంచి 15 వ తేదీ వరకు ప్రత్యేక ఇన్-స్టోర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో గోల్డ్, డైమండ్, పోల్కీ ఆభరణాల విస్తృత శ్రేణి అందుబాటులో ఉంది. క్లింకారా గోల్డ్ అండ్ డైమం డ్స్ వ్యవస్థాపకుడు సంతోష్ మంచికంటి మాట్లాడుతూ.. నమ్మకం, పారదర్శకత, శాశ్వతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆభరణాల రిటైల్ రంగానికి తీసుకురావాలనే దృష్టితో క్లింకారాను స్థాపించాం.

మా తొలి ఫ్లాగ్షిప్ స్టోర్ సర్టిఫైడ్ నాణ్యత, నిజమైన ధరలు, సంప్రదాయానికి ఆధునికతను జోడించిన డిజైన్లకు ప్రతిబింబంగా నిలు స్తుందన్నారు. మరో వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ దుండిగాళ్ల మాట్లాడుతూ, ఈ స్టోర్ ప్రారంభం మా ప్రయాణంలో ఒక మైలురాయి. కాన్సెప్ట్ డిజైన్లు, కస్టమైజేషన్ సదుపాయాలు, ప్రత్యేక బ్రైడల్ లౌంజ్తో ప్రతి అంశాన్ని కస్టమర్లకు వ్యక్తిగతమైన, అత్యున్నత స్థాయి అనుభవం అందించేలా రూపొందించాం అని తెలిపారు.

ప్రారంభోత్సవ ఆఫర్లను ప్రకటించారు. గోల్డ్ జ్యువె లరీపై మేకింగ్ చార్జీలు, వేస్టేజ్ లేవు, 22 క్యారెట్ ఆభరణాలకు 24 క్యారెట్ బులియన్ ధర మాత్రమే, డైమండ్ జ్యువెలరీ రూ.46,999 ప్రతి క్యారెట్ (ఐజీఏ సర్టిఫైడ్), పోల్కీ జ్యువెలరీపై మేకింగ్‌చార్జీలు, వేస్టేజ్‌లేవు, క్లింకారా స్వర్ణ మిత్ర స్కీమ్స్, లక్కీ డిప్ ఆఫర్లు ప్రకటించారు.