విలువైన నగల అపహరణ
23-09-2026 | 03:51pm
మహబూబాబాద్,(విజయక్రాంతి): బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన 90 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను, అపహరించి ప్రైవేట్ ఫైనాన్సు(Private Finance)లో తనఖా పెట్టి డబ్బులు తీసుకొని పరారైన ఘటనలో మహబూబాబాద్ ఇండియన్ బ్యాంక్(Indian Bank) అసిస్టెంట్ మేనేజర్ భూక్యా రాజేష్ ను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారం రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో బాధితులకు బంగారం అప్పగించడానికి చర్యలు చేపట్టామని సిఐ వివరించారు.