చలో హైదరాబాద్ విజయవంతం చేద్దాం
04-09-2026 | 11:15pm
బైంసా,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసి) ఈ నెల 10న తల పెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని జేఏసి నిర్మల్ జిల్లా గౌరవ చైర్మన్ ఎం.సి.లింగన్న,చైర్మన్ వెల్మల ప్రభాకర్ లు పిలుపునిచ్చారు.
జిల్లాలోని ఉద్యోగులంతా భారీ సంఖ్యలో హాజరు కావాలని వారు పేర్కొన్నారు. పిఆర్సి గడువు దాటి మూడు సంవత్సరాలు అయిందని, ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సి.పి.యస్.రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చారని, పాత పెన్షన్ మా హక్కు అని ,తక్షణమే సి.పి. యస్ .రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు విడుదల చేయాలని కోరారు.






