5 September, 2026 | 1:13 AM

రోడ్లపై బీఆర్ఎస్ నిరసన

04-09-2026 | 11:11pm

ప్రతి ఇంటిని సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం

మాజీ మంత్రి రామన్న ధ్వజం

బేల,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS government) బాధ్యత యూతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తే... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కనికరం లేకుండా ప్రతి ఇంటిని సంక్షోభానికి గురి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బేల మండలం(Bela Mandal) మాకోడ గ్రామంలో రహదారిపై చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైనథ్, బేల మండలాల పార్టీ శ్రేణులతో కలిసి వంటావార్పు తో నిరసన చేపట్టారు. రోడ్డుపైనే భజన సంకీర్తనలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... గత ప్రభుత్వం పై ఉన్న అక్కసును తెలంగాణ ప్రజలపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు మహిళలు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, తోపాటు విద్యార్థిని విద్యార్థుల ఉన్నత విద్యా విధానాన్ని పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇలా 420 దొంగ హామీలు ఇచ్చి అధికారం రాగానే మితిమీరిన అహంకారంతో రేవంత్ రెడ్డికి ప్రజలఇచ్చిన హామీలు గుర్తు రావడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు