5 September, 2026 | 1:36 AM

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి

04-09-2026 | 10:47pm

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

భూత్పూర్: అబద్దాల కాంగ్రెస్ ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ పట్టణంలోని శివాలయం నుంచి చౌరస్తా వరకు బిఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ.... 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వెయ్యి రోజులు గడిచిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యలపై ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతు బీమా, యూరియా, బోనస్ వంటి అంశాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. 

కేసీఆర్ సైన్యం తిరగబడితే ఎలా ఉంటుందో చిన్నచింతకుంట మండలంలో జరిగిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇప్పుడు మేము రోడ్డు మీదకు వచ్చే వాళ్లం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులు చూపించి ప్రతి ఒక్కరు నిలదీసే సమయం వచ్చిందన్నారు. విద్యార్థులు, వికలాంగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని ఇప్పుడు అవి ఉత్తి హామీలుగానే మిగిలిపోయాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు