యుద్ధ భూమిగా మార్కెట్

07-11-2026 | 06:40am

యెమెన్‌లో మారణహోమం.. 20 మందికి పైగా మృతి!

సనా: అంతర్యుద్ధంతో ఇప్పటికే అల్లాడుతున్న యెమెన్‌లో(Yemen Market Attack) మరోసారి రక్తపాతం చోటుచేసుకుంది. నిత్యం జనసందడిగా ఉండే మార్కెట్ ఒక్కసారిగా మరణమృదంగంగా మారింది. శుక్రవారం జరిగిన భీకర దాడిలో 20 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తైజ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. యెమెన్ నైరుతి ప్రాంతంలోని తైజ్ ప్రావిన్స్‌లో ఉన్న హల్ అదారా మార్కెట్‌పై ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా నేతృత్వంలోని Coalition Forces మూడు విడతల్లో Air Strikes నిర్వహించాయని హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. సౌదీలోని ఖమిస్ ముషైత్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు ఈ దాడులకు పాల్పడ్డాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో యెమెన్‌లో చోటుచేసుకున్న అత్యంత భీకర దాడుల్లో ఇదొకటిగా హౌతీ వర్గాలు అభివర్ణించాయి.

క్షిపణి ప్రయోగించింది హౌతీలేనా?

మరోవైపు హౌతీల ఆరోపణలను తైజ్ స్థానిక అధికారులు, యెమెన్ ప్రభుత్వ(Yemeni government) వర్గాలు తోసిపుచ్చాయి. అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి వైమానిక దాడులు జరగలేదని స్పష్టం చేశాయి. మార్కెట్‌పై హౌతీ తిరుగుబాటుదారులే Ballistic Missile ప్రయోగించారని ఎదురుదాడికి దిగాయి. ఈ ఘటనకు వారే బాధ్యులని ఆరోపించాయి. దాడికి సంబంధించి ఇరు వర్గాలు పరస్పరం నిందలు వేసుకుంటుండటంతో అసలు నిందితులెవరనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఇప్పటికే ఏళ్ల తరబడి కొనసాగుతున్న Yemen Civil War కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ ఘటన మరో పెను విషాదంగా మారింది.

మరిన్ని వార్తలు