టాస్కు ముందే వర్షం.. రెండో వన్డేపై ఉత్కంఠ
వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆలస్యం!
వెలింగ్టన్: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం వెలింగ్టన్‌లో జరగాల్సిన రెండో ODIకి వర్షం అంతరాయం కలిగించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షం కారణంగా ఆట ఆలస్యమయ్యే అవకాశాలు కనిపించాయి. అయితే తాజాగా వర్షం తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం..
వెలింగ్టన్‌లో మ్యాచ్‌కు ముందు వర్షం కురుస్తున్నట్లు అక్కడి నుంచి సమాచారం అందింది. దీంతో Scheduled Start Timeకు ఆట ప్రారంభం కాకపోవచ్చని నిర్వాహకులు సూచించారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు Updates ఇస్తామని తెలిపారు. వర్షం కారణంగా ఆటగాళ్లు మైదానంలోకి దిగే సమయం ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం వెలింగ్టన్‌లో వర్షం ఆగిపోయింది. మరో 4-5 నిమిషాల్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు (Pitch Inspection) సిద్ధమవుతున్నారు. అవుట్‌ఫీల్డ్ పరిస్థితులు, పిచ్ తేమ, మైదానం ఆటకు అనుకూలంగా ఉందా లేదా అనే అంశాలను పరిశీలించనున్నారు. అంపైర్ల Inspection తర్వాతే మ్యాచ్ ప్రారంభ సమయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభిమానులు తదుపరి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిరీస్‌లో ఆధిక్యం కోసం భారత్ పోరాటం!
తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ సేన ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని Team India పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై బౌన్స్ బ్యాక్ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ బ్యాటర్లపై అభిమానుల దృష్టి ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ కీలకం కానున్నారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్‌పై అంచనాలు ఉన్నాయి.
ఓవర్లు తగ్గుతాయా? అభిమానుల్లో ఉత్కంఠ!
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం మరింత ఆలస్యమైతే DLS Method అమలు చేసే పరిస్థితి రావచ్చు. అవసరమైతే మ్యాచ్ ఓవర్లను కుదించే అవకాశమూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మ్యాచ్ రద్దుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంపైర్ల పరిశీలన, వాతావరణ పరిస్థితుల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. వెలింగ్టన్ నుంచి వచ్చే తాజా Weather Updates కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.