పీవీ సింధు కీలక బాధ్యతలు
అథ్లెట్స్ కమిషన్ చీఫ్‌గా పీవీ సింధు
ఒలింపిక్ సంఘంలో స్టార్ ప్లేయర్లకు పెద్ద పీట
భారత క్రీడా రంగంలో మరో అరుదైన గౌరవం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును(PV Sindhu) వరించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అథ్లెట్స్ కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వైస్ ఛైర్ పర్సన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి ఒలింపిక్ పతకం అందించిన మీరాబాయి చాను, ప్రముఖ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ IOA జనరల్ బాడీలో అథ్లెట్ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. ఈ నలుగురి పదవీకాలం 2026 నుంచి 2030 వరకు నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. ఈ నాలుగు స్థానాలకు సంబంధించి ఆయా విభాగాల్లో ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. Returning Officer సంజయ్ కె. శ్రీవాస్తవ వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి నవంబర్ 7న జరగాల్సిన ఈ ఎన్నికలు ఏకగ్రీవ ఎంపికతో రద్దయ్యాయి.
ఒలింపిక్ కౌన్సిల్లో సింధు, హర్మన్‌ప్రీత్‌కు చోటు!
రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు, హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ పదవులు దక్కడం విశేషం. వీరిద్దరూ అథ్లెట్స్ కమిషన్‌కు నాయకత్వం వహించడంతో పాటు డిసెంబర్ 5న జరగనున్న IOA ఎన్నికల అనంతరం ఏర్పడే Executive Councilలోనూ సభ్యులుగా కొనసాగనున్నారు. క్రీడాకారుల సమస్యలు, వారి హక్కులు, అవసరాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఉన్నత స్థాయిలో ప్రస్తావించే అవకాశం వీరికి లభించనుంది. మరోవైపు మీరాబాయి చాను, సాజన్ ప్రకాశ్ IOA General Bodyలో అథ్లెట్ ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. వీరికి జనరల్ బాడీ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు డిసెంబర్ 5న జరిగే IOA ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. మహిళా, పురుష అథ్లెట్లకు ఒక్కొక్కరికి కేటాయించిన ప్రతినిధి స్థానాల్లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
అథ్లెట్ల గొంతుకగా కొత్త కమిషన్!
క్రీడాకారులే క్రీడా పాలనలో భాగస్వాములవ్వాలనే లక్ష్యంతో IOA Athletes' Commission కీలక పాత్ర పోషిస్తుంది. అథ్లెట్ల హక్కులు, శిక్షణ సదుపాయాలు, సంక్షేమం, అంతర్జాతీయ పోటీల్లో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. ఒలింపిక్ పతక విజేతలు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కీలక స్థానాల్లోకి రావడంతో భారత క్రీడా వ్యవస్థలో అథ్లెట్ల ప్రాతినిధ్యం మరింత బలపడుతుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.