మైనార్టీలకు మాదీ భరోసా

07-11-2026 | 05:20am
  1. ఓల్డ్ సిటీ అభివృద్ధికి, మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
  2. విద్య, సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
  3. హజ్ హౌస్ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ. 25 కోట్లు
  4. మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు మరింత విస్తృతం
  5. సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాం తి): మైనార్టీల అభ్యున్నతికి(Upliftment of Minorities) ప్రజా ప్రభుత్వం(People's Government) పెద్దపీట వేస్తున్నదని.. వారి సామాజిక, ఆర్థి క, విద్యా అభివృద్ధితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అభివృ ద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, అవసరమైన నిధులు వెచ్చిస్తున్నదని చె ప్పారు. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన వి ద్యా అవకాశాలు కల్పించడంతోపాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశ గా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఆయన అన్నారు.

మైనార్టీల అభ్యున్నతి గు రించి సమీక్ష నిర్వహిస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఇచ్చిన హామీలో భాగంగా శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖపై భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షే మ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన ఈ రివ్యూలో మైనార్టీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. 

త్వరలో భవన నిర్మాణం పూర్తి

మైనార్టీలకు విద్యా అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. నాంపల్లిలోని హజ్ హౌస్ పక్కన కొన్నేండ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రహదారుల విస్తరణ పనుల కోసం వినియోగించిన వక్ఫ్ భూములకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్‌బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ. 25 కోట్లను ఈ భవన నిర్మాణం కోసం కేటాయించాలన్నారు.

నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ భవనంలో మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్‌తోపాటు మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 

బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదు

విద్యాసంస్థల భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, ఇతర విద్యాసంస్థలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మొఘల్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన రెండు స్టడీ సర్కిళ్లకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.

ఈ రెండు ప్రాంతాల్లో స్టడీ సర్కిళ్ల నిర్వహణకు అవసరమైన భవనాలను అందించేందుకు అక్బరుద్దీన్ ఒవైసీ సంసిద్ధత వ్యక్తం చేయగా, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారికంగా సమర్పించాలని ఆయన కోరారు. మైనార్టీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పరిధిని విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అర్హులైన విద్యార్థులు వెళ్లగలిగే దేశాల జాబితాలో ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు, రాజీవ్ యువ వికాసం పథకం కింద మైనార్టీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల విడుదల, షాదీ ముబారక్ పథకం తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. క్రైస్తవ మైనార్టీలకు సంబంధించిన సమస్యలను సైతం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అధికారులకు సూ చించారు. మైనార్టీల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధితో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బీ షఫీఉల్లా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు