జీవో 14తో బీసీవర్గాలపై ప్రభుత్వం కుట్ర

07-11-2026 | 05:15am

మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాం తి): బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో(Congress government GO (Government Order)) 14 జారీ చేసిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో బీసీ భవన్ల కోసం కేటాయించిన భూములను లాక్కోవాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడారు.

ఉమ్మడి ఏపీలో కుల సం ఘాలకు దక్కని ప్రాధాన్యం తెలంగాణలో కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యంత విలువైన స్థలాలను కేటాయించిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయ డం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులపై అధికారుల పెత్తనం ఏమిటని నిలదీశారు.  ఆయా కుల సంఘాలు తమకు కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, తమ వర్గాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవాలని భావించాయని తెలిపారు.

అలాంటి సమయంలో ప్రభుత్వ జోక్యానికి అవకా శం కల్పించేలా జీవో 14 తీసుకురావడం బీసీలపై పిడుగు పడినట్లేనని వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్‌కు తెలిసే జీవో విడుదల చేశారా? లేక మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నా రా? అని మండిపడ్డారు. జీవో 14పై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుల సంఘాలను సంఘటితం చేసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

మళ్లీ కేసీఆర్ సీఎం అయితే బీసీలకు కేటాయించే నిధులను రెట్టింపు చేస్తారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ... బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. జీవో 14ను రద్దు చేయకపోతే పోరాటాలు తప్పవన్నారు. మాజీ ఎంపీ బడుగుల లిం గయ్య యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అన్నం పెట్టినోళ్లకు సున్నం పెడుతున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు