జనసేనలోకి వంగవీటి రాధా!

14-10-2026 | 07:45pm

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంగవీటి రాధాకృష్ణ చేరికతో విజయవాడ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయవాడ మేయర్ రేసులో రాధా?

విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ పేరు పరిశీలనలో ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ అంశంపై జనసేన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వంగవీటి రాధాకృష్ణ గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసి, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు