అమ్మకాల్లో రికార్డు.. భారత్‌లో ఈవీ విప్లవం

19-09-2026 | 11:52am

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’(The Future of Environment and Climate Dynamics) అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అభివృద్ధి, పర్యావరణ సుస్థిరత రెండూ కలిసి ఎలా సాగగలవో భారతదేశం చూపిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... అభివృద్ధి,స్థిరత్వం రెండూ సమాంతరంగా సాగాలని సూచించారు.

భారత్ స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ వస్తోందని పేర్కొన్నారు. భారత్ లో ఈవీ విప్లవం(EV Revolution) రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. 2025లో 25 లక్షల ఈవీ వాహనాల అమ్మకాలతో రికార్డు నమోదు చేసినట్లు తెలిపారు. భారత్ లో రైల్వేల విద్యుద్ధీకరణ వందశాతం పూర్తయిందన్నారు. రైల్వేల విద్యుద్ధీకరణతో కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయిందని సూచించారు. షెడ్యూల్ కు ముందే కాప్ 21 లక్ష్యాలను భారత్ అందుకుందని హర్షం వ్యక్తం చేశారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.




మరిన్ని వార్తలు