రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్
- హెన్నీ బి.కాగన్, కెన్సో సోయ్‌లకు సంయుక్తంగా అవార్డు
- ఔషధ ఉత్పత్తుల తయారీలో వీరి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: రసాయన శాస్త్రంలో(Chemistry) చేసిన కృషికి గానూ ఇద్దరు శాస్త్రవేత్తలకు(Scientists') నోబెల్ -2026 బహుమతి వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్నీ బి. కాగన్(Hennie B. Kagan), జపాన్‌కు చెందిన కెన్సో సోయ్‌లకు(Kenso Soy) సంయుక్తంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(Royal Swedish Academy of Sciences) బుధవారం పేర్లను అధికారికంగా ప్రకటించింది. అసిమ్మెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్-లీనియర్ ఎఫెకట్స్, ఆటోక్యాటాలసిస్‌పై చేసిన కీలక పరిశోధనలకు గాను గుర్తింపుగా వీరికి ఈ అవార్డు లభించింది. ఔషధ ఉత్పత్తులకు అవసరమైన రియాక్షన్ డిజైన్లను ఇద్దరు శాస్త్రవేత్తలు రూపొందించారని అకాడమీ పేర్కొంది.
హెన్నీ కాగన్..
రసాయన చర్యలను నియంత్రించే పద్ధతుల అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. ఈయన చేసిన ఆవిష్కరణలు నిర్దిష్ట అణు నిర్మాణాన్ని పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పించాయి. రసాయన అణువుల నిర్మాణాలు ఒకదానికొకటి అద్దం ప్రతిబింబాలుగా ఉంటాయి. ఇవన్నీ ఒకేలా కనిపించినప్పటికీ వాటి ధర్మాలు, చర్యలు భిన్నంగా ఉంటాయి. ఈయన చేసిన పరిశోధనలు ఔషధాల అభివృద్ధిలో కీలకం. దీంతో శాస్త్రవేత్తలకు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయ్యింది. ఔషధాలు, రుచులు,సువాసనలు, నూతన పదార్థాల అభివృద్ధికి మార్గం సుగమమైనట్లయ్యింది.
కెన్సో సోయ్..
రసాయన చర్యలు ఒక రకమైన నిర్మాణానికి బదులుగా మరొక రకమైన నిర్మాణానికి ఎలా అనుకూలంగా ఉంటాయో వివరించడానికి ఈయన చేసిన ఆవిష్కరణ కీలకంగా నిలిచింది. ఈ ప్రక్రియను ‘సోయ్’ చర్య అని కూడా పిలుస్తారు. అసమరూప సేంద్రీయ సంశ్లేషణ (అసిమ్మెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్) రంగంలో ముఖ్యమై నదిగా పరిగణిస్తున్నారు.
కాగా ఈ ఇద్దరు నోబెల్ గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతి విలువ 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లను (రూ. 11.5కోట్లు) శాస్త్రవేత్తలకు సమంగా పంచనున్నారు. 1901 నుంచి రసాయన శాస్త్రంలో 117సార్లు ఈ అవార్డును అందజేశారు. 198మందికి అవార్డు దక్కింది. అత్యంత పిన్నవయస్కుడైన ఫెడ్రిక్ (35) జోలియట్ కెమిస్ట్రీలో అవార్డును అందుకోగా, 97 ఏళ్ల వయసులో జాన్ బీ గుడ్ ఎనాఫ్ (అమెరికా) 2019లో ఈ అవార్డును స్వీకరించారు.