మహారాష్ట్రలో స్వల్ప భూకంపం
03-10-2026 | 10:24am
మహారాష్ట్ర(Maharashtra)లోని హింగోలి, నాందేడ్ జిల్లాల్లో మరోసారి స్వల్ప భూకంప ప్రకంపనలు(Earthquake Tremors) చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం సుమారు 7:46 గంటలకు ఔంధా నాగ్‌నాథ్ తాలూకాలోని గధాలా ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్(Richter Scale)పై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు హింగోలి జిల్లా విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
అకస్మాత్తుగా ప్రకంపనలు రావడంతో స్థానికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఎలాంటి భారీ నష్టం(Damage) జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.