జాతిపితకు ఘన నివాళి!
ఆళ్ళపల్లి, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక సర్పంచ్ వాసం సుష్మిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్, గ్రామ పెద్దలు గౌరి శెట్టి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు గ్రామాభివృద్ధికి(Development) ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్, ప్రశాంత్, సాయి రాజు గౌడ్, తులం ముత్తిలింగం, నరేడ్ల వెంకన్న, తులం శ్రీను, శ్రీరామ్, సంపత్, పానుగంటి మంగ, మంగయ్య, తెలగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.