ఇండిగో ఇంధన సర్‌చార్జీపై కేంద్రం స్పందన

06-10-2026 | 02:34pm

ఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇండిగో (IndiGo) ఇంధన సర్‌చార్జీ (Fuel Surcharge) పెంపుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభం (West Asia Crisis) ప్రభావంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు.

ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో (OMCs) చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ చర్చలు ఏ దిశగా సాగుతాయో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. విమానయాన రంగంపై పెరుగుతున్న ఇంధన వ్యయాల ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.


మరిన్ని వార్తలు