విజయారెడ్డికి ఖైరతాబాద్ లైన్ క్లియర్?
హైదరాబాద్: గవర్నర్ కోటాలో (Governor Quota) మూడు ఎమ్మెల్సీ స్థానాలు నవంబర్ మూడో వారంలో ఖాళీ కానుండటంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ (TPCC Chief), పార్టీ ముఖ్య నేతలతో పలువురు ఆశావహులు లాబీయింగ్ (Lobbying) చేస్తున్నట్లు సమాచారం.ఈ మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి బీసీ వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌కు ఎమ్మెల్సీ బెర్త్ దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డికి (Vijaya Reddy) ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ విషయంలో లైన్ క్లియర్ అయినట్లేనని గాంధీభవన్ (Gandhi Bhavan) వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ స్థానాల భర్తీతో పాటు వచ్చే రాజకీయ సమీకరణాలపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.