బాణం గుర్తుకు ఓటేసి ఆర్టీసీ టీ డబ్ల్యూ యును గెలిపించాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్, అక్టోబర్ 6( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అండగా ఉంటుందని ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel ) అన్నారు.ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం ఉట్నూర్ డిపోను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి కార్మికులతో సమావేశమై మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ఆర్టీసీ టి డబ్ల్యూ యు సంఘాన్ని గెలిపిస్తే సంస్థకు మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి కార్మికుడు బాణం గుర్తుకు ఓటు వేసి టి డబ్ల్యూ యు ను గెలిపించాలని కోరారు.
కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉట్నూర్ డిపో సెక్రెటరీగా పోటీ చేస్తున్న గబ్బర్ సింగ్ చౌవాన్ బాణం గుర్తుకు ఓటు వేసిగెలిపించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ కోరారు.ఈ కార్యక్రమంలో లక్కారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరసుకోల తిరుపతి,ఉట్నూర్ ఆర్టీసీ డిపో నుండి సెక్రటరీగా పోటీ చేస్తున్న చౌవాన్ గబ్బర్ సింగ్, ఆర్టీసీ టి డబ్ల్యూ యు యూనియన్ నాయకులు మెస్రం కేశవ్ , శ్రీరామ్, తులసి రామ్, గబ్బర్ సింగ్ , సంగీత, వందన ,కార్మికులు పాల్గొన్నారు.