విష్ణు ప్రియ కుటుంబానికి పరామర్శించిన డాక్టర్ మట్టా
సత్తుపల్లి. అక్టోబర్ 6. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన ఇమ్మడిబోయిన విష్ణు ప్రియ మృతి చెందడంతో, సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న ఆమె పార్థివదేహాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Dr. Matta Dayanand Vijay Kumar) సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం విష్ణు ప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.