జూకు వెళ్లిన కొత్త జంట.. భర్తకు ఊహించని షాక్!
బైక్ పార్క్ చేస్తుండగా.. భార్య మాయం!
గ్వాలియర్: భార్యతో కలిసి సరదాగా జూకు వెళ్లిన ఓ కొత్త పెళ్లికొడుకుకు ఊహించని పరిణామం ఎదురైంది. భర్త బైక్ పార్క్ చేసి తిరిగి వచ్చేలోపే భార్య మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్లిపోయినట్లు సమాచారం. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్(Gwalior)లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల యువకుడు తన 18 ఏళ్ల భార్యను జూకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్ పార్క్ చేసేందుకు భర్త వెళ్లగా, ఆ సమయంలో అతడి భార్య అర్మాన్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి మరో బైక్పై వెళ్లిపోయినట్లు భర్త ఆరోపించాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ(CCTV)లో రికార్డైనట్లు సమాచారం. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను అర్మాన్ ఖాన్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, యువతి వెళ్లిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
पति के साथ चिड़ियाघर देखने आई लेकिन प्रेमी के साथ oyo देखने चली गई इतनी प्लानिंग पहले से थी कि पति को बाइक पार्क करने में जितना समय लगा उतने में पत्नी प्रेमी के साथ बाइक पर बैठकर भाग गई अब पति बेचारा अपनी.....Read more https://t.co/NubfFKJ0um
— Abhishek Raj (@abhiraj94158) October 8, 2026