వనదుర్గమ్మను దర్శించుకున్న మెదక్ జడ్జి
* ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు
* ఆలయ మర్యాదలతో సత్కరించిన అర్చకులు, సిబ్బంది
పాపన్నపేట,అక్టోబర్10: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా(Vanadurga Mata Temple).. మంజీరా(Manjira) 'ఏడు' పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ ప్రాంతంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల(Etupayala) వనదుర్గామాతను మెదక్ జడ్జి పాపిరెడ్డి(Medak Judge Papireddy) శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆలయ విశిష్టతను వివరించారు. వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.