అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లు పట్టివేత

02-11-2026 | 10:31pm

మాగనూరు, నవంబర్ 2. మాగనూరు మండల పరిధిలోని 167 వ జాతీయ రహదారి(National Highway)  వడ్వ టు గేటు వద్ద అక్రమముగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను సోమవారం పట్టుకున్నట్లు మాగనూరు ఎస్సై మహేందర్ రెడ్డి(Maganur SI Mahender Reddy) తెలిపారు.

పోలీస్ సిబ్బంది తమ పరిధిలో బైక్ పెట్రోలియం మరియు నిఘా విధుల్లో ఉండగా రెండు వేరు వేరు చోట్ల అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టుకొని విచారించగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో టిప్పర్లను పోలీస్స్టేషన్ తరలించి డ్రైవర్ల పై ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు