దామరచర్ల లో కాంగ్రెస్ రాస్తారోకో
08-10-2026 | 02:29pm
దామరచర్ల :అక్టోబర్ :8 సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్ కుమార్ ను(Gyanesh Kumar) అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డిల్లీ లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నార్కెపల్లి అడ్డంకి రహదారిపై దామరచర్ల లో గురువారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్ ,గాజులశ్రీనివాస్ ,బంటు కిరణ్,గాలం వెంకన్న ,నర్సిరెడ్డి ,వెంకటేశ్వర్లు ,అంజిరెడ్డి, రవితేజ ,మంగతా,మోహన్ రెడ్డి,ప్,జీడయ్య తదితరులు పాల్గొన్నారు