ఇందిరా మహిళా శక్తి కిట్ల పంపిణీ

08-10-2026 | 03:39pm

కౌన్సిలర్ ఉప్పు నాగమణి-హనుమంతరావు

సత్తుపల్లి. అక్టోబర్ 8. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి.ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayi Dayanand)  ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర  మహిళ కి అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి - అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక కిట్లను సత్తుపల్లి 13వ వార్డులో కౌన్సిలర్ ఉప్పు నాగమణి - ఉప్పు హనుమంతరావు  ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారని, మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు లోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మరిన్ని వార్తలు