ఫుట్‌బాల్ జట్టులో గురుకుల విద్యార్థి ప్రతిభ
- ఉమ్మడి జిల్లా జట్టుకు బొడ్డుపల్లి విజయవర్ధన్ ఎంపిక
నాగర్ కర్నూల్, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా తెలకపల్లి మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బొడ్డుపల్లి విజయవర్ధన్ ఫుట్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడల జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో విజయవర్ధన్ ప్రతిభ కనబరిచాడు. 14, 17 ఏళ్ల బాలుర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ ఆధారంగా ఉమ్మడి జిల్లా జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. విజయవర్ధన్ ఎంపిక కావడంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, పిఈటి మల్లేష్, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.