భార్యపై హత్యాయత్నం

29-09-2026 | 11:00pm

నిందితుడైన భర్త అరెస్ట్

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం(Kothapalli Mandal) చింతకుంటకు చెందిన మొలంగూరు అనుష అనే వివాహితపై హత్యాయత్నం చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతకుంట చెందిన అనూషకు 16 సంవత్సరాల క్రితం ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కొంతకాలంగా అనూష భర్త ఆంజనేయులు తన భార్యకు గోపి అనునతనితో చనువుగా ఉంటుందని భార్యాభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆమె గోపితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో బెదిరించగా అనూష ప్రస్తుతం కిసాన్ నగర్ లో ఉంటుంది.

ఆమె కదలికలను గమనించిన భర్త ఆంజనేయులు మంగళవారం చింతకుంట ప్రభుత్వ స్కూల్ వద్దకు అనూష రాగా ముందస్తు పథకం ప్రకారం ఆంజనేయులు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇద్దరు వచ్చి అనూషతో మాట్లాడుకుందామని చెప్పి పక్కకు పిలిచి పెట్రోల్, ఆసిడ్ పోసి కారంపొడి చల్లి అగ్గిపెట్టతో అంటించేందుకు ప్రయత్నించారు. అనూష గట్టిగా అరవడంతో స్కూల్ టీచర్లు బయటకు రావడంతో ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనపై అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయులు అరెస్టు చేశారు. మరో నిందితుడు  లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడని కొత్తపల్లి ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ తెలిపారు.

మరిన్ని వార్తలు