బీజేపీ మండల నాయకుల ముందస్తు అరెస్ట్
29-09-2026 | 11:03pm
గణపురం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): హిందూ దేవతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ గణపురం మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్న బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మంద మహేష్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన తమను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని అన్నారు. అరెస్టులతో తమ ప్రశ్నించే గొంతును అణచలేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బీజేపీ సీనియర్ నాయకుడు సోమ దామోదర్, మండల నాయకులు వడ్డం రాజశేఖర్, వేముల రమేష్, చిత్తలూరి కార్తీక్ గౌడ్ తదితరులు ఉన్నారు.