పకడ్బందీగా నవోదయ పరీక్షను నిర్వహించాలి
బిజినేపల్లి, నవంబర్ 26 : వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం(Vattem Jawahar Navodaya Vidyalaya) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు పరీక్షా నిర్వాహకులను ఆదేశించారు. గురువారం వట్టెం నవోదయ విద్యాలయంలో వివిధ నవోదయ పరీక్ష కేంద్రాల సెంటర్ పర్యావేక్షకులకు, కేంద్ర స్థాయి పరిశీలకుల శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ.. నాగరుకర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కలిపి నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహించాలన్నారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి .పూర్ణిమ మాట్లాడుతూ మూడు జిల్లాల వ్యాప్తంగా 18 కేంద్రాలలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు అత్యంత పోటీతో హాజరవుతున్న పరీక్షార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్ష నిర్వహణలో ఏ చిన్న పొరపాటు లేకుండా శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని,
మొత్తం 18 పరీక్షా కేంద్రాలలో 4284 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారన్నారు. ఇందులో నాగర్ కర్నూల్ జిల్లా నుండి 10 కేంద్రాల్లో 2214 మంది విద్యార్థులు హాజరు కాగా, జోగులాంబ గద్వాల జిల్లా నుండి - 4 కేంద్రాల్లో 1002 మంది విద్యార్థులు, వనపర్తి జిల్లాలోని 4 కేంద్రాల్లో 1068 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.