విద్యుత్ పొదుపే మేలు.. వృథాకు చెక్!
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. విద్యుత్ వృథాను అరికట్టి, అవసరమైన మేరకే వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
గురువారం తిమ్మాజిపేట మండలం ఆర్సీ తండాలో నూతన హైమాస్ట్ లైట్లను (High Mast Lights) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా వృథాను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, సర్పంచ్ శ్రీను, ఉపసర్పంచ్ జ్యోతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.