MBBS డాక్టర్ సీటు సాధించిన జాం సూర్యప్రతాప్కు

22-10-2026 | 08:58pm

శాలువాతో సన్మానం బిఆర్ఎస్ పార్టీ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు

పెంట్లవెల్లి అక్టోబర్ 22: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన జామ్ సూర్యప్రసాద్(Jam Suryaprasad ) నిరూపించారు. దినసరి కూలీలుగా కష్టపడే తల్లిదండ్రుల కష్టాన్ని వృథా కానివ్వకుండా, ప్రభుత్వ పాఠశాల కళాశాలలో(Government School and College) చదువుతూ  ఎలాంటి ఖరీదైన కోచింగ్ తీసుకోకుండానే ఎంబిబిఎస్ మెడికల్ సీటు సాధించి తన గ్రామానికి గొప్ప పేరు తేవాలన్నారు.

పెంట్లవెల్లి గ్రామానికి చెందిన జామ్ వెంకటస్వామి, దేవేంద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (సూర్యప్రసాద్) సంతానం. నిత్యం కూలీనాలీ చేస్తేనే కానీ కుటుంబం గడవని అతి సాధారణ పేద కుటుంబం వారిది. అయినప్పటికీ సూర్యప్రసాద్ కష్టపడి చదివి, నీట్ (NEET) లో మంచి ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని హయత్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించారు.

విద్యార్థి జామ్ సూర్యప్రసాద్ ఎంబిబిఎస్ చదువు పూర్తి చేసుకుని డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, దళిత జాతికి,నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉచితంగా వైద్య సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలవాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి అంబేద్కర్ వారసులు  టీచర్ ఆంజనేయులు, నీరడి కురుమూర్తి,బోడ చెన్నకేశవులు, కోట్ల కొండల్, మూలే చంద్రశేఖర్, నాగటి రాజు, బిజ్జ కురుమూర్తి,  మరికంటి హరీష్, బైరపోగు సతీష్, మరికంటి చెన్నకేశవులు, మూలే జగదీష్,  మూలే గౌతం,ఏటూరి ప్రకాష్, బ్యాగరి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు